గూగుల్ మ్యాప్స్ లో ఇమ్మెర్సివ్ వ్యూ ఫీచర్.. ఇంట్లో కూర్చునే ప్రపంచం చూసేయొచ్చు..!

మనం ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్( Google Maps ) ఉపయోగిస్తాం.

ప్రస్తుతం చాలామంది అడ్రస్ చెప్పలేక లొకేషన్ షేర్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా ఆ ప్రాంతానికి సులువంగా వెళ్తున్నారు.

ఈ గూగుల్ మ్యాప్స్ ప్రజలకు ప్రతిరోజు 2000 కోట్ల కిలోమీటర్ల రూట్లను చెబుతుందని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.

త్వరలో గూగుల్ మ్యాప్స్ లో ఇమ్మెర్సివ్ వ్యూ ఫీచర్ ( Immersive View Feature )రాబోతోంది.

మనం ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్లే ముందు అక్కడ వాతావరణం, అక్కడి పరిసరాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా చూడగలిగితే ఎంత బాగుంటుందో కదా.

అలా చూసేందుకు ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా రూపొందించారు.అంతేకాకుండా ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే నడుస్తూ, సైక్లింగ్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ కూడా చూసేందుకు వీలుగా ఉంటుంది.

"""/" / ఈ ఫీచర్ కంప్యూటర్ విజన్, AI టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేస్తుంది.

ఈ ఫీచర్ తో ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో విధులు ఎలా ఉన్నాయో, పరిసరాలు ఎలా ఉన్నాయో స్పష్టంగా చూడవచ్చు.

ప్రయాణ మార్గాన్ని ముందుగానే స్పష్టంగా చూడవచ్చు.మనం వెళ్లే మార్గంలో ఉండే ఇల్లు, చెట్లు, షాపులు, బైక్ లైన్, సైడ్ వాక్, పార్కింగ్ స్పాట్, పెట్రోల్ బంక్, ఏటీఎం లాంటివి ప్రతిదీ ఎక్కడెక్కడ ఉన్నాయో స్పష్టంగా గూగుల్ మ్యాప్స్ లో చూడవచ్చు.

"""/" / అంతేకాకుండా ఏ రోజు, ఏ సమయంలో ఫలానా ప్రాంతంలో వాతావరణం, ట్రాఫిక్( Weather ) ఎలా ఉందో అనే సమాచారం కూడా పొందవచ్చు.

ఈ ఫీచర్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే గాలి యొక్క నాణ్యతను కూడా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ మరికొన్ని నెలల్లోనే ప్రపంచంలోని 15 నగరాలలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

ఆ నగరాలు ఏవేవంటే న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, వెనిస్, సీటెల్, శాన్ జోస్, లాస్ వేగాస్, బెర్లిన్, డబ్లిన్, మియామి, ఆమ్ స్టర్ డామ్ నగరాలలో ఈ గూగుల్ మ్యాప్స్ తో ప్రతి వీధి స్పష్టంగా చూసేయొచ్చు.

ఈ వారం థియేట్రికల్, ఓటీటీ క్రేజీ సినిమాలు ఇవే.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయా?