ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులు మంటలే ఐఎండి తాజా హెచ్చరిక…!!
TeluguStop.com
రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలో నమోదు అవుతున్నాయి.ఏపీ, తెలంగాణలో( AP, Telangana ) ఎండలు బీకరంగా ఉన్నాయి.
రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకోవటం జరిగింది.పట్టుసీమలో ఎండ తీవ్రతకు 100 ఎకరాలలో వరికుప్పలు దగ్దమయ్యాయి.
తెలంగాణలోను పలు జిల్లాలలో 47 డిగ్రీలు నమోదు అయ్యాయి.మంచిర్యాలలో వడదెబ్బకు ఒకరు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పుల తీవ్రత పెరగటంతో జనం అల్లాడిపోతున్నారు.
మంగళవారం చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ ( Dr.BR Ambedkar )తెలియజేయడం జరిగింది.
"""/" /
ఇదిలా ఉంటే బుధవారం నుండి శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో పలు జిల్లాలలో దాదాపు 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతల్లో నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.కాబట్టి వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి పంపుతున్న హెచ్చరిక సందేశాలు పాటించాలని.
అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.
విడాకులు తీసుకుంటే అలా జడ్జ్ చేస్తారా….ఫైర్ అయిన సమంత?