డీకే అరుణను అవమానించడం లేదు..: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ నాయకురాలు డీకే అరుణ( DK Aruna ) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.

డీకే అరుణను తాను అవమానించడం లేదని తెలిపారు.డీకే అరుణ ప్రధాని మోదీ చేతిలో కత్తిలా మారి తమ కడుపులో పొడుస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కొడంగల్ నియోజకవర్గంపై( Kodangal Constituency ) కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ప్రేమ ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే కొడంగల్ లో దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో కృష్ణా జలాలతో పాటు రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారని ఆరోపించారు.

70 ఏళ్ల పాటు పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో డీకే అరుణ పాలమూరుకు ఏమీ చేయలేదని విమర్శించారు.

అంతేకాకుండా గతంలో మక్తల్ ఎత్తిపోతలకు కూడా డీకే అరుణ అడ్డుపడ్డారని చెప్పారు.కానీ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని స్పష్టం చేశారు.

అభిమానుల విన్నపాన్ని చరణ్ పట్టించుకుంటారా.. అలా చేస్తే గేమ్ ఛేంజర్ కు ప్లస్!