పెన్ పహాడ్ మండలంలో పెచ్చుమీరిన అక్రమ ఇసుక రవాణా..!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని నాగులపాటి అన్నారం, దోసపాడు,అనాజీపురం గ్రామాల నుండి మూసి నదిలో యధేచ్చగా ఇసుక దందా జరుగుతుందని, ఇక్కడి నుండి జిల్లా నలుమూలకు అక్రమ ఇసుక రవాణా అవుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

అనాజీపురం,దోసపహాడ్ నాగులపహాడ్,అన్నారం,రావులపెంట నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు దండుకోవడంతో కాసులు వర్షం కురిపిస్తోందని,ఇసుక అక్రమ రవాణా ఒక వ్యాపారంగా మారి రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లలో,లారీలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అంటున్నారు.

ప్రభుత్వ పనుల పేరిట ఇసుకను రవాణా చేస్తున్నామని చెపుతూ అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఇసుక వ్యాపారానికి ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా రాత్రిపగలు తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని,మరి కొందరు లారీల్లో ఇసుకను హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరిలిస్తున్నారని,వారికి ఎలాంటి ఛలానా,పర్మిషన్ లేకుండా జరిగే ఈ అక్రమ ఇసుక దందాను అడ్డుకునేవాళ్ళు లేరా?అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు.

ఒత్తిడి, తలనొప్పి క్షణాల్లో పరార్ అవ్వాలా.. అయితే ఇది ట్రై చేయండి!