రేషన్ అక్రమ దందాలను అరికట్టాలి:సిపిఎం

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly Constituency ) వ్యాప్తంగా హాలియా కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా యధేచ్చగా సాగుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ఆరోపించారు.

మంగళవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో వారు విలేఖర్లతో మాట్లాడుతూ చౌక ధరల దుకాణంలో కార్డుదారుల నుండి చౌకగా బియ్యాన్ని కేజీ పది రూపాయలకు కొనుగోలు చేసి అధిక ధరలకు అక్రమ మార్గంలో రైస్ మిల్లులో అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ హైటెక్ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కొందరు స్థానిక రైస్ మిల్లుల్లో, మరికొందరు సరిహద్దులు దాటిస్తున్నారని,ఈ దందాలలో ఎవరి స్థాయిలో వారు చిన్న పెద్ద తేడా లేకుండా పలుకుబడి ఉపయోగించుకొని కొందరు,వ్యవస్థలని మేనేజ్ చేస్తూ మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి వారి పని వారు చేసుకుపోతున్నారని,నిన్న మొన్న మీడియాలో చూస్తున్నా కథనాల ప్రకారం ఈ దందా గత పదేళ్లుగా విచ్చలవిడిగా కొనసాగిందన్నారు.

సివిల్ సప్లయ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం,ఈ దందాలో మీడియా పలుకుబడి కలిగిన వారు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో అక్రమ రేషన్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిందని, అక్రమ దందాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదలకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వింజమూరి పుల్లయ్య పాల్గొన్నారు.

సివిల్స్ సాధించి సేవాభావంతో వేలమంది ఆకలి తీరుస్తున్న ధాత్రి రెడ్డి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!