రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు..: అచ్చెన్నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీలో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.కేవలం రాజకీయ కక్షతోనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.

చట్టం, న్యాయం, ధర్మం లేకుండా వ్యవహారిస్తున్నారన్నారు.చంద్రబాబు విజన్, దార్శనికత ప్రపంచానికి తెలుసన్న అచ్చెన్నాయుడు అటువంటి వ్యక్తిని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇరికించారని మండిపడ్డారు.

చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోయే వ్యక్తి కూడా కాదని చెప్పారు.అదేవిధంగా ఆయన ఎక్కడో దాక్కునే వ్యక్తి కాదన్నారు.

కుట్రపూరితంగానే చంద్రబాబును కుంభకోణంలో ఇరికించారని తెలిపారు.సీఐడీ జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు.

తండేల్ సినిమా కథ వినగానే ఆ సినిమానే గుర్తొచ్చింది… దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్!