అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులకు పరాకాష్టః చంద్రబాబు
TeluguStop.com

కుప్పంలో వైసీపీ చర్యలను తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.అన్నా క్యాంటీన్, టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి.


తిరిగి టీడీపీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆరోపించారు.తన పర్యటనలో పాల్గొన్న 60 మందిపై కేసులు బనాయించారని విమర్శించారు.


వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించిన చంద్రబాబు.పోలీసుల మద్ధతుతోనే దాడులు జరుగుతున్నాయన్నారు.
దాడి జరిగిన వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడంపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ శ్రేణులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?