అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎల్లారెడ్డిపేట 2ఏఎన్ఎంల ముందస్తు అక్రమ అరెస్టులు

ఏఎన్ఎం( ANMs ) లను రెగ్యులర్ చేయాలని ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయడం కోసం పిలుపునివ్వడంతో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 2 ఏఎన్ఎం లను ముందస్తు అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు.

ఈ సందర్భంగా 2 ఏఎన్ఎంలు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఎన్ హెచ్ ఎం కింద 2 ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నామని, 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలోనే చేస్తున్నామని అన్నారు.

తెలంగాణ వస్తే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అనే మాటే ఉండదని చెప్తే సంతోషించామని, తెలంగాణ ( Telangana ) వచ్చాక మా జాబు పర్మినెంట్ అవుతుందని ఆశపడ్డామని అన్నారు.

కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు కావస్తున్న మా జాబ్స్ పర్మినెంట్ చేయకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

2 ఏఎన్ఎంలను అందరినీ రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని 1 ఏఎన్ఎం లకు ఇస్తున్న మాదిరిగానే 2ఏఎన్ఎం లకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ఆన్లైన్ ఆఫ్లైన్ అని అదనపు పని వారాలను మోపి 2 ఏఎన్ఎం లను వేధించడం తగదని అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.

అరెస్ట్ అయిన వారిలో స్వప్న దేవి, సువర్ణ, మంజుల, భారతి, సుజాత, రూప, పుష్పలత, రాజేశ్వరి, పద్మ, శ్యామల, అమృతవల్లి తదితరులు ఉన్నారు.

ఈ మూడింటిని వాటర్ లో కలిపి నిత్యం తీసుకుంటే మీ శరీరంలో సగం రోగాలు పరారవుతాయి!