తెలుగు సినిమాలపై మనసు పడ్డ ఇలియానా

దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా కెరియర్ లో టర్న్ తీసుకొని వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటి గోవా బ్యూటీ ఇలియానా.

ఈ భామ తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలోనే బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తూ వచ్చింది.

అయితే బాలీవుడ్ లో ఈ అమ్మడుక అవకాశాలు వచ్చిన అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ రాలేదు.

అడపాదడపా సినిమాలు చేస్తూ ఒకే అనిపించుకుంది.అక్కడ అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు లేకుండా చూపిస్తున్న ఈ అమ్మడుని చూడటానికి అక్కడి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఎలాంటి సన్నివేశాలు చేయడానికి అయిన ఒకే అని చెబుతున్న అక్కడి దర్శకులు ఈ అమ్మడుని కనికరించడం లేదు.

ఎక్కువగా తన బికినీ అందాలతో ఇన్స్టాగ్రామ్ ఫాన్స్ కి కాస్తా ఉత్సాహం అందిస్తూ ఉంటుంది.

అయితే లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు హోం క్వారంటైన్ కి పరిమితం అయిన ఈ అమ్మడుకి అలా బీచ్ లో బికినీలతో తిరిగే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత మరల సౌత్ లో బిజీ అవ్వాలని భావిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ దర్శక, నిర్మాతలకి టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది.

అయితే వారిలో ఎవరైనా కనికరించి ఇలియానాకి మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పిస్తారేమో చూడాలి.

బుల్లితెరపై ప్రభాస్ పరువు పాయే.. సలార్ మూవీ టీఆర్పీ రేటింగ్ ఇంత ఘోరమా?