ఎట్టకేలకు తన భర్తని చూపించిన ఇలియానా… ఫోటో వైరల్?

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈమె అమ్మగా మారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ తన కొడుకు బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.

కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉండేవారు.

అయితే ఉన్నఫలంగా ఈమె తాను తల్లి కాబోతున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు.

దీంతో అభిమానులు ఒక్కసారిగా అసలు పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"""/" / ఇలా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని ప్రకటించినటువంటి ఇలియానా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.

కానీ తన ప్రియుడి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చేవారు.

అయితే వీరికి పెళ్లి ( Ileana Marriage ) జరిగిందా లేదా అన్నది మాత్రం రహస్యంగానే ఉంచారు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఇలియానా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇలా ఒంటరిగా బాబు బాగోగులు చూసుకుంటూ ఉండడం కష్టంగా అనిపించడం లేదా అంటూ ఈమెను ప్రశ్నించడంతో తాను ఒంటరిగా లేనని తన భర్తతో ఉన్నటువంటి( Ileana Husband ) ఫోటోని ఈమె షేర్ చేశారు.

"""/" / ఇలా తాను సింగిల్ పేరెంట్ కాదు అంటూ ఈమె తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇకపోతే తిరిగి సినిమాలలోకి వస్తారా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను తన బిడ్డ( Son )బాధ్యతలను చూసుకుంటూ ఉన్నానని అయితే తిరిగి ఎప్పటికైనా సినిమాలలోకి వస్తానని ఈమె తెలియజేశారు.

మొత్తానికి ఇలియానా తన భర్త ఫోటో అందరికీ చూపించారు అయితే ఈయన ఏం చేస్తారు ఏంటి అన్న విషయాలపై మరోసారి అందరిలోనూ సందేహం నెలకొంది.

బతికున్న పామును కరకరా నములుతూ తినేసిన సౌత్ కొరియా అమ్మాయి.. వీడియో వైరల్..