ఆ టాలీవుడ్ డైరెక్టర్ చాలా టార్చర్ చేశారు… సూసైడ్ ఆలోచనలు వచ్చాయి: ఇలియానా

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ఇలియానా ( Ileana ).

ఒకరు.వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు అనంతరం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన పోకిరి ( Pokiri ) సినిమాలో కూడా నటించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా తెలుగు తమిళ భాష చిత్రాలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.

"""/" / ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసారు.

ఈ తరుణంలోనే ఇటు సౌత్ సినిమాలను మిస్ చేసుకుంటూ బాలీవుడ్ సినిమాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు తద్వారా కెరియర్ పై భారీ దెబ్బ పడింది దీంతో ఇండస్ట్రీకి కూడా ఈమె దూరమయ్యారు.

ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి తన వైవాహిక జీవితంలో ఇలియానా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు.

"""/" / తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది తనని మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపారు.

ముఖ్యంగా కొందరు డైరెక్టర్లు తనని వేధించారని అందులో ఒక టాలీవుడ్ డైరెక్టర్( Tollywood Director ) తన కోరిక తీర్చమంటూ నన్ను టార్చర్ చేశారని ఇలియానా తెలిపారు.

ఆ సమయంలో ఆయన టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవాలని కూడా భావించాను కానీ ఆ సమయంలో నాకు ఫ్యామిలీ గుర్తొచ్చిందని ఓ వ్యక్తి కోసం నేను చనిపోవడం ఏంటి అని ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నానని ఇలియానా తెలిపారు.

ఇలా టాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పిన ఈమె ఆయన ఎవరు పేరు చెప్పకపోవడం గమనార్హం.

డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!