చెవిలో పువ్వు పెట్టుకొని మీసాలు పెంచుకున్న ఇలియానా.. ఏదో తేడా కొడుతుందంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా.ఈ బ్యూటీ గురించి తెలియని వారెవ్వరూ లేరు.

తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలతో తన ఖాతా నింపుకుంది.

ఇక స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని వెనుతిరిగి చూడకుండా ముందుకు ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

పైగా ఒక్క ఏడాదికే వరుస సినిమాలతో స్టార్ హీరోలతో పోటీగా నిలిచింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు సంపాదించుకుంది.ఇక మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అనుకోకుండా శరీర సైజును పెంచి అందరికీ షాక్ అయ్యేలా చేసింది.

ఆ సమయంలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా నటించింది.కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టాలీవుడ్ కు దూరమైంది.దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

కానీ అక్కడ కూడా అంత సక్సెస్ కాలేకపోయింది. """/"/ మళ్లీ సినిమాలలో అడుగు పెట్టడానికి మునుపటిలా తయారు కావడానికి బాగా కష్టపడింది.

జిమ్ములో సమయాన్ని ఎక్కువ గడుపుతూ తెగ వర్కౌట్లు చేసింది.అంతేకాకుండా డైట్ ఫుడ్ కూడా తీసుకుంది.

అలా మొత్తానికి శరీరాన్ని తగ్గించుకొని మునుపటిలా తయారయింది.ఇక గ్లామర్ డోస్ ను పెంచి తన అందాలతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.

ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది ఇలియానా.

ప్రతిరోజూ ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఇక తను బీచ్ లో దిగిన ఫోటోలను చూస్తే మతిపోవడం గ్యారెంటీ.

అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు రావట్లేదు అని చెప్పాలి.

నిజానికి ఇప్పుడంతా కొత్త కొత్త హీరోయిన్ లు రావడంతో ఇలియానాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు.

"""/"/ అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం బాగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు.

ఇక నిత్యం ఫోటో షూట్ లతో తాను చేసే హల్ చల్ మాత్రం మామూలుగా ఉండదు.

బికినీలతో మాత్రం తన ఎద అందాలను ఆరబోస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.

అయితే అందులో తాను చెవిలో పువ్వు పెట్టుకొని ఉండగా తాను మీసాలతో కనిపించింది.

చూడ్డానికి అచ్చం మగవారిలా ఉండటంతో అందరు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఏదో తేడా కొడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫొటో బాగా వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?