Ileana: ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్ కు లోనయ్యాను.. ఇలియానా ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ, తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.
మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాలో( Pokiri Movie ) నటించి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారి పోయింది.
ఆ తరువాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఒకప్పుడు తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.ఒకవైపు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది.
బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.అయితే గత ఏడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ( Pregnancy ) ప్రకటించి అందరికీ షాకిచ్చింది.
ఆ తర్వాత ఆగస్టులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్( Koa Phoenix Dolan ) అని పేరు కూడా పెట్టింది.
అయితే ప్రస్తుతం బిడ్డతో సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. """/" /
ఇలియానా ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ప్రసవం అనంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు ఆమె తెలిపింది.ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు( Michael Dolan ) సపోర్ట్‌గా ఉన్నారని వివరించింది.
ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ.ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు( Depression ) గురయ్యాను.
కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నాను.నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను.
ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు.
అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది.తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పాను అని చెప్పుకొచ్చింది ఇలియానా.
"""/" /
అనంతరం తన భాగస్వామి గురించి మాట్లాడుతూ.బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాము.
నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నాను.మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ.
అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు.నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు అంటూ భర్త గురించి చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది.
అల్లు అర్జున్ అరెస్టుపై వేణు స్వామి భార్య షాకింగ్ కామెంట్స్… నేను ముందే చెప్పానంటూ?