ఆ ఫోబియాతో బాధ పడ్డ ఇలియానా.. ఏం జరిగిందంటే..?
TeluguStop.com
రామ్ హీరోగా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన దేవదాస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యారు.
ఇలియానా.దేవదాస్ సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోల సినిమాల్లో ఇలియానాకు వరుస ఆఫర్లు వచ్చాయి.
హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్న ఇలియానా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.
"""/"/
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కు దూరమైన ఇలియానాకు ప్రస్తుతం ఆ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు తగ్గాయి.
అయితే తాజాగా ఇలియానా బాడీ డిస్ మార్ఫియా అనే ఫోబియా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన శరీరం విషయంలో తనకు అసంతృప్తి ఉండేదని ఇలియానా చెప్పుకొచ్చారు.అద్దంలో శరీరంను చూసుకున్న సమయంలో వేదనకు గురైనట్లు ఇలియానా తెలిపారు.
కొందరు అమ్మాయిలకు శరీర సౌష్టవం బాగానే ఉన్నా కొలతలు కరెక్ట్ గానే ఉన్నా శరీరం విషయంలో ఏదో అసంతృప్తి వెంటాడుతుందని ఇలా అనిపించడాన్నే బాడీ డిస్ మార్ఫియా అంటారని ఇలియానా తెలిపారు.
చూడటానికి అందంగా ఉన్నా అద్దంలో చూసుకున్న సమయంలో ఏదో ఒక లోపం కనిపిస్తుందనిఆ లోపంను కవర్ చేసుకోవడం కోసం మళ్లీ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని ఇలియానా అన్నారు.
మనస్సును నిర్మలంగా ఉంచుకుని లైఫ్ లోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తే మనకు మనం అందంగానే కనిపిస్తామని బాడీ డిస్ మార్ఫియా సమస్యతో ఒకప్పుడు తాను కూడా బాధ పడ్డానని ఇలియానా చెప్పారు.
అయితే ఇప్పుడు తాను మారానని శరీరంలో పాజిటివ్ అంశాలను చూడటంతో పాటు శరీరం విషయంలో గర్వంగా ఫీల్ అవుతానని ఇలియానా వెల్లడించారు.
ఇలియానా బాడీ డిస్ మార్ఫియా అనే ఫోబియా గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో టాప్ హీరో అతనే.. వాళ్లు సైతం అంగీకరించారుగా!