మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… గుడ్ న్యూస్ చెప్పిన నటి!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం ఇతర భాషలలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ఇలియానా ( Ileana ) ఒకరు.
ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ప్రేమ అంటూ ఈమె కెరియర్ పై ఫోకస్ తగ్గించారు.
తద్వారా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.ఇలా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
"""/" /
ఇలా సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పుడూ అభిమానులతో పంచుకునేవారు అయితే ఉన్నఫలంగా ఈమె తాను తల్లిని కాబోతున్నానంటూ ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు.
దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు అసలు ఇలియానా పెళ్లెప్పుడు చేసుకుంది ఇలా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"""/" /
ఇక ఈమె పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్టు ఎన్నో విమర్శలు వచ్చాయి అయితే ఈమె తన భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు చివరికి తనకు బాబు పుట్టిన తర్వాత తన భర్తను కూడా పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇలా 2023 ఏప్రిల్ నెలలో ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఇలియానా మరోసారి తల్లి కాబోతుందని తెలుస్తుంది.
ఇటీవల కొత్త సంవత్సరం రావడంతో గత సంవత్సర జ్ఞాపకాలను ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రూపంలో షేర్ చేశారు.
అందులో భాగంగా ప్రెగ్నెన్సీ ( Pregnancy ) కిట్ చూపిస్తూ అక్టోబర్ లోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని ఈమె చెప్పకనే చెప్పేసారు దీంతో అభిమానులు ఈమెకు మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నారు.
రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?