నేటి తరం సంగీత దర్శకులపై ఇళయరాజా సంచలన వాఖ్యలు!

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో స్వర మాంత్రికుడు, మ్యూజిక్ మేస్ట్రోగా తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు ఇళయరాజా.

ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికి కూడా ఎవర్గ్రీన్ గా ఉన్నాయి.పాత తరం నుంచి నేటి తరం వరకు ప్రతి ఒక్కరు ఇళయరాజా పాటలని ఏదో ఒక క్షణం ఆస్వాదిస్తూ ఉంటారు.

ఆహ్లాదంగా మనసుని తాకే అతని పాటలు ఈ తరం సంగీత దర్శకులు స్ఫూర్తిగా తీసుకొని వాటిని కాస్త మార్చి నేటి తరంకి కనెక్ట్ అయ్యే విధంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ఇళయరాజా సాంగ్స్ ని కూడా చాలా మంది మళ్ళీ రీమేక్ చేస్తున్నారు.

అయితే నేటితరం సంగీత దర్శకులు ఇళయరాజా సాంగ్స్ ని అలా రీమేక్ చేయడం ఒరిజినల్ అతను ఎంత మాత్రం ఇష్టపడటం లేదని ఇళయరాజా మాటల బట్టి అర్ధమవుతుంది.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో కొత్త సంగీత దర్శకులపై ఇళయరాజా సంచలన వాఖ్యలు చేసారు.

తన సాంగ్స్ ని ఇప్పుడు సంగీత దర్శకులు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు అంటే వారికి సామర్ధ్యం లేకపోవడం కారణం అని అన్నారు.

తాజాగా 96 సినిమా కోసం కూడా తన మ్యూజిక్ ని కాపీ చేసి వాడుకున్నారని, దీనిని బట్టి వారికి తన మ్యూజిక్ ని అందుకునే సామర్ధ్యం లేకపోవడమే అని చెప్పుకొచ్చారు.

తన సాంగ్స్, మ్యూజిక్ కాపీ చేసి వాళ్ళు మ్యూజిక్ చేతకాని వాళ్ళే అని ఇళయరాజా విమర్శలు చేసారు.

స్టార్ హీరో విజయ్ పదో తరగతి మార్క్ లిస్ట్ వైరల్.. అతని మార్కులు తెలిస్తే షాకవ్వాల్సిందే!