ఇళయరాజా ఇకనైనా తగ్గవయ్యా

ఇండియాలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు.కొన్ని లక్షల పాటలను వారు ట్యూన్‌ చేశారు.

కాని ఏ ఒక్కరు కూడా కాపీరైట్‌ మరియు రాయల్టీ గురించిన పోరాటం చేయలేదు.

తమ పాటలు స్టేజ్‌ల మీద పాడుకుంటూ ఉంటే విని ఆనందించిన సంగీత దర్శకులు ఉన్నారు.

కాని ఇళయరాజా మాత్రం తన పాటలను స్టేజ్‌పై పాడినా లేదంటే మరెక్కడైనా వినిపించినా కూడా రాయల్టీ డిమాండ్‌ చేస్తున్నాడు.

తన పాటలన్నింటికి కూడా కాపీ రైట్‌ తీసుకోవడంతో పాటు రాయల్టీ చెల్లించాల్సిందే అని పాటలను వినియోగించుకుంటున్న వారికి కోర్టు నోటీసులు కూడా పంపించి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఎవరు ఏం అనుకున్నా కూడా తాను అనుకున్నట్లుగా ముందుకు వెళ్లి రాయల్టీ పొందిన సంగీత దర్శకుడు ఇళయరాజా.

ఆ వివాదం మెల్లగా సర్దుమణుగుతున్న సమయంలో మళ్లీ రెచ్చి పోయాడు.ఇళయరాజాకు ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్‌ మనవడు సాయి ప్రసాద్‌కు మద్య వార్‌ జరుగుతోంది.

ఆ వార్‌లో ఇళయరాజా మొండితనం క్లీయర్‌గా కనిపిస్తుంది అంటూ తమిళ సినీ ప్రముఖులు అంటున్నారు.

ప్రసాద్‌ స్టూడియోలోని ఒక రూంను ఇళయరాజా గౌరవార్థంగా ఎల్వీ ప్రసాద్‌ ఇచ్చాడు.ఇప్పుడు స్టూడియోను రీ డిజైన్‌ చేయించే క్రమంలో ఆ రూంను తొలగించేందుకు సాయి ప్రసాద్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

"""/"/ గౌరవార్థం బహుమానంగా ఇచ్చిన రూంను గత 40 ఏళ్లుగా వాడుకుంటూనే ఉన్న ఇళయరాజా ఇప్పుడు ఆ ఫ్యామిలీ వారు అడిగితే ఇచ్చేందుకు ఏంటీ ఇబ్బంది.

అందుకుగాను వారు ప్రత్యామ్నాయం చూపించే అవకాశం కూడా ఉన్నప్పుడు మొండి పట్టుకు పోకుండా వదిలేయవచ్చుగా అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

కాని ఇళయరాజా మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేసి అభివృద్దిలో కీలక పాత్ర పోషించిన ఎల్వీ ప్రసాద్‌ కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చడం ఏం బాగాలేదంటూ ఇళయరాజాపై అసహనం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

కారులో 300 కి.మీ వేగంతో దూసుకెళ్లిన రష్యన్ యువకుడు.. ట్రక్కును గుద్దెయడంతో??