కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు.. ఇళయరాజా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఇళయరాజా( Ilayaraja ) ఒకరు కాగా ఇళయరాజా మ్యూజిక్ కు ఈ జనరేషన్ లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇళయరాజా తాజాగా తన పుట్టినరోజు వేడుకలను( Ilayaraja Birthday ) జరుపుకోలేదు.అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారని తాను మాత్రం కూతురుని కోల్పోవడం వల్ల ఎలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని పేర్కొన్నారు.

అయితే ఇదంతా మీ కొరకే కానీ తన కొరకు కాదని ఇళయరాజా వెల్లడించారు.

ఇళయరాజా కూతురు భవతారిణి( Bhavatharini ) ఈ ఏడాది జనవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఇళయరాజా 81వ పుట్టినరోజు సందర్భంగా కమల్ తో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇళయరాజా ఫ్యాన్స్ టీ నగర్ లో ఉన్న ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు పోటెత్తడం జరిగింది.

"""/" / ఇళయరాజాతో ఫోటో దిగడానికి వందల సంఖ్యలో అభిమానులు బారులు తీరడం గమనార్హం.

ఇళయరాజా సైతం వచ్చిన అభిమానులను ఇబ్బంది పెట్టకుండా వాళ్లతో సంతోషంగా ఫోటోలు దిగారు.

1943 సంవత్సరం జూన్ నెల 3వ తేదీన ఇళయరాజా జన్మించారు.సంగీతమే ఇళయరాజా ప్రపంచం కాగా ఈ మధ్య కాలంలో ఆయన పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

"""/" / ఇళయరాజా ఇప్పటికీ కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

1000కు పైగా సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ అందించారంటే ఆయన ప్రతిభ ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులను ఇళయరాజా సొంతం చేసుకోవడం గమనార్హం.ఇళయరాజా రెమ్యునరేషన్( Ilayaraja Remuneration ) సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

ఇళయరాజా పాటలను ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

ఇళయరాజాకు గట్టి పోటీ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా తక్కువమంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక టార్గెట్ కొడాలి నాని ? అన్నీ సిద్ధం చేస్తున్నారా ?