ఇఫ్తార్‌ విందులు మతసామరస్యానికి ప్రతీకలు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:సమాజానికి ఉపయోగడే అల్లా బోధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిఅన్నారు.

సూర్యాపేటలోని 48 వ వార్డ్ కూరగాయల మార్కెట్ లో నూతనంగా నిర్మించిన లతీఫీయ మజీద్ ను ఆదివారం అయన ప్రారంభించిన మంత్రి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

అంతకు ముందు మంత్రి మాట్లాడుతూ ఇఫ్తార్‌ విందులు మతసామరస్యానికి ప్రతీకలు అని అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే మైనార్టీ సంక్షేమం అమలు అవుతుందనన్నారు.గతంలో ఉన్న ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంక్ లా మాత్రమే చూశారని, వాళ్ళ సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమని, సమాజం బాగుండాలని, ప్రకృతి కరుణించాలని ముస్లీం సోదరులు చేస్తున్న కఠోర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని కోరారు.

నూతన మజీద్ ప్రారంభం సందర్భంగా ముస్లీం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మీరా వలీ,రియాజ్, తాహెర్ పాషా,సల్మా,అక్తర్ మౌలానా,గాయాజ్, ఖలీల్,అబ్దుల్ బారీ, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు… అయోమయంలో బీజేపీ ?