అమ్మ బాబోయ్.. శరీరంలో జింక్‌ లోపిస్తే ఇన్ని సమస్యలు వస్తాయా?

మన శరీరానికి అవసరం అయ్యే అత్యంత ముఖ్యమైన పోషకాల్లో జింక్ ఒకటి.అయితే చాలా మందికి ఈ విషయం తెలియనే తెలియదు.

ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్.

ఇవి మాత్రం తీసుకుంటే సరిపోతుందని భావిస్తుంటారు.కానీ ఈ జాబితాలో జింక్ కూడా ఉండేలా చూసుకోవాలి.

ఎందుకంటే మ‌న‌ శరీరంలో జింక్ లోపిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.జింక్( Zinc ) లోపించడం వల్ల హెయిర్ ఫాల్( Hair Fall ) తీవ్రంగా మారుతుంది.

జుట్టు చిట్లడం, పల్చబడటం జరుగుతాయి.అలాగే కొందరిలో జింక్ లోపం వెయిట్ లాస్ కు కారణం అవుతుంది.

బాడీకి సరిపడా జింక్ అందనప్పుడు జీర్ణ శక్తి తగ్గిపోతుంది.దాంతో ఆకలి మందగిస్తుంది.

ఏం తినాలన్నా వెనకడుగు వేస్తారు.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ( Vitamin A ) మాత్రమే కాదు జింక్ కూడా ఎంతో అవసరమ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడైతే జింక్ లోపిస్తుందో అప్పుడు కంటి చూపు తగ్గడం ప్రారంభం అవుతుంది.కళ్ళు మసకబారతాయి.

"""/" / పురుషుల్లో జింక్ లోపం చాలా ప్రమాదం.ఎందుకంటే ఇది సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది.

దీంతో తండ్రి కావాలన్న కల కలగానే మిగిలిపోతుంది.అంతేకాదు జింక్ లోపం వల్ల రోగ నిరోధక వ్యవస్థ( Immune System ) బలపడుతుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచూ వేధిస్తాయి.మనసు ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది.

బలహీనంగా మారతారు.రుచి, వాసన గ్రహించే శక్తి తగ్గుతుంది.

"""/" / అందుకే శరీరానికి అవసరమయ్యే జింక్ ను అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జింక్ కోసం పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, గుడ్డు, వెల్లుల్లి, జీడిపప్పు, డార్క్ చాక్లెట్, శనగలు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి.

వీటిలో జింక్ పుష్కలంగా నిండి ఉంటుంది.అందువల్ల ఈ ఆహారాలు తీసుకుంటే జింక్ లోపం దూరం అవుతుంది.

ఈ కాఫీ క్రీమ్ తో కళ్ళ చుట్టూ నలుపును పది రోజుల్లో వదిలించుకోవచ్చు!