మే 8వ తేదీన సంకష్ట చతుర్ధి రోజు గణపతిని ఇలా పూజిస్తే.. సంతానం లేనివారికి సంతాన భాగ్యం..!

జ్యేష్ట మాసం ( Jeshta Month )మొదటి ఉపవాసం చతుర్ధి తిధి రోజు ఆచరిస్తారు.

జ్యేష్ఠ కృష్ణా పక్షంలోని చతుర్ధి తిధిని ఏకదంతా సంకాష్ట చతుర్ధి అని పిలుస్తారు.

ఈ రోజున గణపతిని పూజించిన వారికి అన్నీ కష్టాలు, బాధలు తొలగిపోయి అపారమైన ఆనందం కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు.

ఈ రోజున సూర్యోదయం నుంచి చంద్రోదయం( Moon Rise ) వరకు కఠినమైన ఉపవాసం పాటిస్తారు.

ఏకదంతా సంకాష్టి చతుర్ధి యొక్క తేదీ, శుభసమయం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏకదంత సంకష్ట చతుర్థి ఉపవాసం మే 8వ తేదీన పాటిస్తారు. """/" / ఈ రోజున ఉపవాసం ఉండి గణపతి ని పూజించడం వల్ల జ్ఞానం మరియు సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

జ్యేష్ఠ మాసంలోనే కృష్ణపక్ష చతుర్థి తిథి 8 మే రోజున సాయంత్రం 6.

18 నిమిషములకు మొదలవుతుంది.ఇది మే తొమ్మిదో తేదీన సాయంత్రం నాలుగు గంటల 8 నిమిషములకు ముగుస్తుంది.

ఈరోజు సాయంత్రం చంద్రోదయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.ఈ రోజున శివయోగం( Shiva Yogam ) కూడా ఏర్పడబోతోంది.

అటువంటి పరిస్థితులలో గణపతిని పూజించడం ద్వారా శంకరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. """/" / గణేష్ ఆరాధన కు శుభ సమయం సాయంత్రం ఐదు గంటలు రెండు నిమిషాల నుంచి రాత్రి 8 గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది.

శివయోగం మే 8 వ తేదీ రోజు 2.53 Am నిమిషంలో నుంచి మే 9వ తేదీ 12.

10 నిమిషాల వరకు ఉంటుంది.వ్రతంలో సాయంత్రం గణపతిని పూజించి చంద్రుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.

చంద్రుడిని పూజించకుంటే వ్రతన్ని అసంపూర్ణంగా భావిస్తారు.ఇంకా చెప్పాలంటే ఏకదంతా సంకాష్ట చతుర్థి( Sankashta Chaturthi ) మతపరమైన దృక్కోణంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

ఈ రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు దూరం అయిపోతాయి.

మీ కోరికలు ను నెరవేర్చుకోవడానికి ఈ రోజున ఉపవాసం ఉండాలనే నిబంధన కూడా ఉంది.

ఈ ఏకదంతా సంకాష్ట చతుర్ధి రోజు ఉపవాసం చేయడం వల్ల సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే సంతానం కోసం ఈ రోజు గణపతిని పూజించడం మంచిది.

ఈ సినీ సెలబ్రిటీస్ అందరూ రాజుల కుటుంబానికి చెందినవారు !