“పాకిస్థాన్‌లోనైతే నిన్ను కిడ్నాప్ చేసేవాణ్ణి”.. ప్యాసింజర్‌కు ఉబర్ డ్రైవర్ టెర్రర్ పుట్టించాడు!
TeluguStop.com
రీసెంట్‌గా ఒక టాక్సీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
కెనడాలో(Canada) జరిగిన ఈ సంఘటనలో, పాకిస్థాన్‌కు చెందినట్లు చెప్పుకునే డ్రైవర్ ఒక మహిళా ప్యాసింజర్‌తో మాట్లాడుతూ, "మనం పాకిస్థాన్‌లో(pakistan) ఉంటే, నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఉండేవాడిని" అంటూ టెర్రర్ పుట్టించాడు.
సదరు మహిళా అతను అంటున్న మాటలను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఆ ఉబర్ డ్రైవర్(Uber Driver) మాటలకు మహిళ భయపడింది. """/" /
మే 14న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కెనడాలోని టోరంటో సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ వీడియోపై ప్రజల స్పందనలు భిన్నంగా ఉన్నాయి.
కొందరు డ్రైవర్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.అతనిని సస్పెండ్ చేయాలని లేదా డీపోర్ట్ చేయాలని కోరారు.
డ్రైవర్ వ్యాఖ్యలు అసహ్యకరమైనవి, బెదిరింపుగా ఉన్నాయని వారు కొందరు కామెంట్లు చేశారు. """/" /
మరోవైపు, కొందరు డ్రైవర్‌ను సమర్థిస్తున్నారు.
వీడియో పూర్తిగా ఉండకపోవచ్చు లేదా ఎడిట్ చేసి ఉండవచ్చని, డ్రైవర్ పూర్ ఇంగ్లీష్ కారణంగా తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వారు వాదించారు.
డ్రైవర్ బెదిరింపులు చేయడం కంటే పాకిస్థాన్‌లోని ప్రమాదాల గురించి వివరించడానికి ప్రయత్నించాడని వారు అభిప్రాయపడ్డారు.
అయితే వీడియోలో టాక్సీ నుంచి దిగి వెళ్లిపోయేటప్పుడు మహిళ నవ్వి డ్రైవర్‌కు ధన్యవాదాలు తెలిపింది.
దీనిని బట్టి, డ్రైవర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రమైన బెదిరింపుగా భావించలేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఎందుకు నవ్వింది, డ్రైవర్ ఉద్దేశ్యం ఏమిటో అని చాలా మంది వేరే చర్చలు మొదలుపెట్టారు.
ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కష్టం.
ఏపీలో పదో తరగతి టాపర్ కు ఎకరం పొలం.. కలెక్టర్ చేసిన సాయానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!