ఛీ, రైలు టాయిలెట్‌లో టీ పాత్రలు కడుగుతున్నాడుగా.. వీడియో చూస్తే వాంతి చేసుకుంటారు!

కొంతమంది దుర్మార్గులు ఆహార పదార్థాలను చాలా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఇలాంటి నీచుల వీడియోలు ఇప్పటికే చాలానే వైరల్ అయ్యాయి.తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది.

ఇందులో ఒక వ్యక్తి రైలు టాయిలెట్‌లో( Man In Train Toilet ) టీ కంటైనర్‌ను జెట్ స్ప్రేతో కడుగుతూ కనిపించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆహార పరిశుభ్రత, ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వీడియోను అయూబ్ ( Ayub )అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

వీడియోపై "ట్రైన్ కి చాయ్" అనే టెక్స్ట్ ఓవర్లే కూడా ఉంది.వీడియోలో, ఒక వ్యక్తి ఇండియన్ స్టైల్ టాయిలెట్‌పై కంటైనర్‌ను పెట్టి, జెట్ స్ప్రేతో కడుగుతున్నాడు.

అయూబ్ ఈ పోస్ట్‌కు " రైల్లో టీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. """/" / ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇండియన్ రైల్వేస్‌ను ( Indian Railways )ట్యాగ్ చేస్తూ, రైళ్లలో ఆహార పదార్థాల విషయంలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఇది అసహ్యంగా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో తయారుచేసిన టీని ఎవరైనా ఎలా తాగుతారు?" అని ఒకరు కామెంట్ చేశారు.

"నేను అందుకే రైళ్లలో ఆహారం, పానీయాలు ముట్టను.రుచి ఒక్కటే కాదు, పరిశుభ్రత కూడా ముఖ్యం" అని మరొకరు అన్నారు.

"ఇంకా చెప్పేదేముంది, టీ అమ్మేవారిని ఎలా నమ్మాలి?" అని ఇంకొకరు ప్రశ్నించారు.చాలామంది కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆహార పదార్థాలు తయారు చేసేవారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు. """/" / అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేశారనే వివరాలు తెలియరాలేదు.

రైలు పేరు, తేదీ వంటి వివరాలు వెల్లడి కాలేదు.కానీ, ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారేం కాదు.

2018లో చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.ఒక టీ అమ్మే వ్యక్తి టాయిలెట్ నీటిని టీ తయారు చేయడానికి ఉపయోగించాడు.

ఆ వీడియో వైరల్ కావడంతో, ఇండియన్ రైల్వేస్ విచారణ జరిపి, ఆ వెండర్‌కు రూ.

1 లక్ష జరిమానా విధించింది.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!