అరెస్టులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఖబర్డార్:రాపోలు నవీన్ కుమార్

సూర్యాపేట జిల్లా:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ నేరేడుచర్ల పట్టణంలోబీఎస్పీ శ్రేణులు రాస్తారాకో నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచాలని చూస్తే ఊరుకోమని అన్నారు.

నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తున్న బీఎస్పీరాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు.ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రశ్నాపత్రాల లీకేజీలు సమర్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట కాలయముడుగా మారిందన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంలో విఫలమైందని విమర్శించారు.బహుజన ఉద్యమకారులను, బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం వలన నిరుద్యోగ యువత సమస్యలు తీరవని,అరెస్టులతో ఉద్యమాలను అణగతొక్కాలని చూస్తే అంతే స్థాయిలో బహుజన ఉద్యమ స్థాయి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి,మండల కన్వీనర్ పెద్దపంగు సురేష్ బాబు,అమరవరపు వెంకటేశ్వర్లు,బీవీఎఫ్ కన్వీనర్ ప్రెమ్ కుమార్, పోలె వెంకటేశ్వర్లు,రాం శ్రీను,ఆదిమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ కొత్త సినిమాకు మెగాస్టార్ టైటిల్ ఫిక్స్ అయిందా.. అసలేం జరిగిందంటే?