గుండె పోటుకు దూరంగా ఉండాల‌నుకుంటే ఈ ఎల్లో ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మంది గుండె పోటుకు గుర‌వుతున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, మ‌ద్యపానం, ధూమ‌పానం, మధుమేహం, రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల గుండె పోటుతో స‌త‌మ‌తం అవుతున్నారు.

ఈ క్రమంలోనే కొంద‌రు ప్రాణాలు కూడా విడుస్తున్నారు.ప్ర‌తి సంవ‌త్స‌రం గుండె పోటు కార‌ణంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

అందుకే ప్రతీ ఒక్కరు గుండె ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్రద్ధ వ‌హించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

అయితే గుండె పోటుకు దూరంగా ఉండాల‌నుకుంటే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే ఎల్లో పుడ్స్ అద్భ‌తుంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఎల్లో ఫుడ్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.మామిడి పండు.

రుచి ప‌రంగానే కాదు పోష‌కాల ప‌రంగానూ రారాజే.ముఖ్యంగా గుండెకి మామిడి పండు ఎంతో మేలు చేస్తుంది.

రోజుకు ఒక మామిడి పండును తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగిపోయి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

త‌ద్వారా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఎల్లో క్యాప్సికమ్.గుండె పోటుకు దూరంగా ఉండాల‌నుకుంటే త‌ప్ప‌కుండా దీన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.

ఎల్లో క్యాప్సిక‌మ్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.అదే స‌మ‌యంలో ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

కంటి ఆరోగ్యం సైతం మెరుగుప‌డుతుంది. """/" / పైనాపిల్‌.

గుండెకు మేలు చేసే ఎల్లో ఫుడ్స్‌లో ఇది ఒక‌టి.పైనాపిల్‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే.

అందులో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ర‌క్ష‌ణ క‌వ‌చంలా మార‌తాయి.గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.

ఇక ఇవే కాకుండా మొక్క‌జొన్న‌, నిమ్మ పండ్లు, అర‌టి పండ్లు వంటి ఆహారాలు కూడా గుండె పోటు ద‌రి చేర‌కుండా ర‌క్షిస్తాయి.

కాబ‌ట్టి, వీటిని కూడా డైట్‌లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

ఏపీలోనూ ‘ హైడ్రా ‘ ? అమలు దిశగా చంద్రబాబు అడుగులు