వ్యాపారంలో పురోగతి సాధించాలంటే పటికతో ఇలా చేయాల్సిందే...!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడి ఏ విధమైనటువంటి గొడవలు, కొట్లాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెబుతారు.

ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి వస్తువులలో పటిక ఒకటి.పటిక ఇంటిలో ఉండడం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా మన ఇంట్లో సానుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు.

ఈ క్రమంలోనే వ్యాపార రంగంలో ఉండే వారు విద్యార్థులు కూడా వారి విద్యా రంగంలో వ్యాపార రంగంలో పురోగతి సాధించాలి అంటే పటికతో ఇలా చేయాల్సిందే.

మీ వ్యాపార రంగంలో పురోగతి సాధించాలన్న లేదా విద్యార్థులు విద్యారంగంలో ముందుకు కొనసాగాలన్న పటికను ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంటిలో లేదా వ్యాపారం చేసే చోట ఒక మూలన ఉంచడం వల్ల వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.

అదే విధంగా కొందరి ఇంటిలో ఎక్కువ గొడవలు జరుగుతూ నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

అలాంటి వారికి పటిక ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. """/" / ఎవరి ఇంటిలో అయితే గొడవలు, కొట్లాటలు ఉంటాయో అలాంటి వారి ఇంటిలో ఒక గిన్నెలో కాస్త పటిక వేసి ఇంట్లో ఒక మూలన ఉంచాలి.

ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటంవల్ల ఎవరి మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉండకుండా సంతోషంగా ఉంటారు.

అదే విధంగా పూజ గదిలో కొద్దిగా పటిక గిన్నెలోకి వేసి నీళ్లు పోసి పెట్టాలి.

ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.

థాంక్స్ అన్నయ్య అంటూ బాలకృష్ణపై నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్..!!