కాంగ్రెస్ లో చేరాలంటే వాళ్లను ఒప్పించాల్సిందే .. హై కమాండ్ ఆదేశాలు ?
TeluguStop.com
ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరికలు జోరు కనిపిస్తోంది.బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేకపోవడం, కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.
ఇప్పటికే దాదాపు ఐదు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇంకా ఆ జాబితాలో చాలామంది ఉన్నారు.
అయితే అలా వచ్చి చేరుతున్న బీఆర్ఎస్ నేతల కారణంగా కాంగ్రెస్( Congress Party ) లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు అది పెద్ద తలనొప్పి తెస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనాకు వచ్చింది.
దీంతో ఇకపై పార్టీలో చేరే వారిని వ్యతిరేకించే నేతలతో ముందుగానే సంప్రదింపులు చేయాలని, వారిని ఒప్పించిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
"""/" /
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న వారి కారణంగా రాబోయే రోజుల్లో తమ సీటుకు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న వారి కారణంగా రాబోయే రోజుల్లో తమ సీటుకు ఇబ్బంది వస్తుందనే భయం ఉండడంతోనే వారి రాక విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగా విమర్శలకు దిగడం , అలక చెందడం వంటివి చోటు చేసుకున్నాయి అని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది .
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వస్తీకరణలో భాగంగా తెలంగాణలో మరో 50 వరకు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
"""/" /
అసెంబ్లీ సీట్ల పునర్విభజన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి.అందుకే నేతలు వచ్చి చేరినా, సీనియర్ల ప్రాధాన్యం తగ్గదని , మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ లకు ప్రాధాన్యం ఉంటుందని , వారి గౌరవంకు భంగం కలగకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి అధిష్టానం సూచించినట్లు సమాచారం.
దీంతో ఇకపై కాంగ్రెస్ లో చేరాలనుకున్న నేతలు ముందుగా ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ నేతలను ఒప్పించాల్సిందేనట.