సంపద పెరగాలంటే ఈ పరిహారం చేస్తే ఎంతో మంచిది!

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు.

అయితే కొందరికి ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు.ఇలా చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడేవారు సంపద పెరగాలంటే కొన్ని పరిహారాలు పాటిస్తూ ఉంటారు.

మరి సంపద పెరగాలంటే ఈ చిన్న పరిహారం పాటించడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమత మయ్యేవారు, డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిలబడని వారు ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఒక పెద్ద దీపపు ప్రమిదలను తీసుకుని ఆ ప్రమిదను ఎంతో అందంగా అలంకరించాలి.

అలాగే బియ్యపుపిండితో ముగ్గు వేసే దేవుని గదిలో ఆ ముగ్గుపై ఆ ప్రమీదను ఉంచి అందులోకి రాళ్ళ ఉప్పు వేయాలి.

అనంతరం దానిపై మరొక చిన్న ప్రమిదను ఉంచి అందులో ఆవు నూనె వేసి ప్రమిదను వెలిగించాలి.

ఇలా ప్రతి శుక్రవారం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది.

"""/"/ ఈ క్రమంలోనే అమ్మవారికి పాలు పటికబెల్లం కొబ్బరికాయ దేనినైనా నైవేద్యంగా సమర్పించాలి.

ఇలా 11 లేదా 16 శుక్రవారాలు పాటు ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా సంపద పెరుగుతుంది.

ఈ విధంగా వెలిగించిన దీపపు ప్రమిదను ఏం చేయాలి అనే విషయానికి వస్తే మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసుకొని నీళ్లలో కలిపి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశములో పోయాలి.

లేకపోతే ఏదైనా చెరువు లేదా బావి ఉంటే ఉప్పును తీసుకెళ్లి అందులోకి పడేయడం ఎంతో మంచిది.

ఆ సీన్లను డైరెక్టర్ సుకుమార్ కాపీ చేసి సినిమాలో పెట్టారా.. అసలేం జరిగిందంటే?