మహిళలలో సంతాన ఉత్పత్తి పెరగాలంటే కచ్చితంగా వీటిని తినాల్సిందే..!
TeluguStop.com
వివాహం అయిన ప్రతి మహిళకు తల్లి కావాలనే కోరిక ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఎందుకంటే నవ మాసాలు మోసి కడుపులో బిడ్డను పెంచి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలకు కలిగే అనుభూతి వర్ణించలేనిది అని కచ్చితంగా చెప్పవచ్చు.
అందుకే ప్రతి మహిళ పిల్లలకు తల్లి కావాలని కలలు కంటూ ఉంటుంది.కానీ చాలామంది మహిళలు ఎన్నో రకాల వల్ల సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు.
ఆరోగ్యపరంగా మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు వారిలో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపి చివరకు వారిని అమ్మతనానికి దూరం చేస్తున్నాయి.
కాబట్టి మహిళలలో సంతాన ఉత్పత్తి పదిలంగా ఉండడం ఎంతో ముఖ్యం. """/" /
మహిళలలో సంతాన ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి? అనేదానిపై చాలామందికి కనీస అవగాహన కూడా లేదు.
అయితే సంతాన ఉత్పత్తి పెరగడానికి ఏవేవో చేయాల్సిన అవసరం లేదని సరైన ఆహారం తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు.
మరి మహిళలలో సంతాన ఉత్పత్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ,సీ,B3 వంటి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఇవన్నీ మహిళలలో సంతాన ఉత్పత్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.అందుకే బలహీనంగా ఉన్న మహిళలు ప్రతిరోజు దానిమ్మ పండు( Pomegranate ) తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
"""/" /
ఇంకా చెప్పాలంటే అంజీర్ కూడా మహిళలకు ఎంతో మంచిది.ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
అలాగే ఇందులో ఉండే క్యాల్షియం మహిళల్లో ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.అంతేకాకుండా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర పోషకాలు మహిళల్లో సంతాన ఉత్పత్తిని పెంచుతాయని చాలా పరిశోధనాలలో తెలిసింది.
ముఖ్యంగా చెప్పాలంటే బీన్స్( Beans ) మహిళలలో సంతాన ఉత్పత్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా పెరుగు, అండాశాయ పాలికల్స్ ను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.అందుకే ప్రతిరోజు మహిళలు పెరుగు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా పైనాపిల్, జీడిపప్పు, ఫ్యాటీ ఫిష్, వంటివి కూడా ఆహార డేట్ లో చేర్చుకుంటే మహిళల్లో సంతాన ఉత్పత్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారు ఖరీదు ఎంతో తెలుసా?