లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నువ్వులు బెల్లం తో ఇలా చేస్తే చాలు..
TeluguStop.com
సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రాత్రనకా, పగలనకా కష్టపడుతూ ఉంటారు.ఇలా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం తమ పై ఉండాలని కోరుకుంటూ ఉంటారు.అయితే ఎంత కష్టపడినా కొందరికి మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు.
ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు.ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయని వేద పండితులు చెబుతున్నారు.
సాధారణంగా దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పై ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అయితే దానధర్మం అనేది లేని వారికి మాత్రమే చేయాలి.అలాగే బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఆ పుణ్యఫలం లభిస్తుందని పెద్దవారు చెబుతున్నారు.
అలా కాకుండా మనకు ఇష్టమైన వారికి నచ్చిన వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
అందుకే పేదవారికి దానం చేయాలి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అన్ని శుభపరిణామాలు కలుగుతాయి.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమ కుటుంబ సభ్యులపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
"""/" /
పేద బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం శుక్రవారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.
అంతే కాకుండా బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు, బెల్లం శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత నువ్వులు, బెల్లం ఆవుకు తినిపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పై ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమైపోతాయి.
ప్రయాణంలో వాంతులా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!