వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే.. ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరిస్తే..?

వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరిస్తే?

ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఎంతో నియమనిష్ఠలతో పార్వతీ -పరమేశ్వరులను పూజించాలి.

వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరిస్తే?

అదే విధంగా పౌర్ణమి రోజు కుమారస్వామి- దేవయానిని, రాముడు-సీత వంటి దంపతులను భక్తిశ్రద్ధలతో పూజించాలి.

వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరిస్తే?

ఈ విధంగా ఆ దంపతులను సతీసమేతంగా పూజించటం వల్ల ఎవరి దాంపత్య జీవితంలో అయితే అడ్డంకులు ఏర్పడి ఉంటాయో ఆ అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడపాలంటే ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరించాలని పండితులు చెబుతున్నారు.

పౌర్ణమి రోజు ఉదయమే నిద్రలేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకుని ఆ పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయటం ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుంది.

అదే విధంగా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల వారి కుటుంబం సకల సంతోషాలతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఉపవాస దీక్షలతో చేయాలి.ఉపవాస దీక్షతో ఆరోజు ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

ఈ విధంగా కఠిన ఉపవాస దీక్షలతో పౌర్ణమి వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా,చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది.

ఫాల్గుణ పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను కలిగిస్తుంది.పౌర్ణమి రోజు వ్రతమాచరించి సాయంత్రం చంద్రుని పూజించడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది.

అదేవిధంగా లలితా సహస్ర పారాయణం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

ముఖ్యంగా పౌర్ణమిరోజు దీపోత్సవం, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలగడమే కాకుండా, దంపతుల మధ్య ఉన్న వివాదాలు సైతం తొలగిపోతాయి.

ముఖ్యంగా పౌర్ణమి రోజు చంద్రునికి అరటి ఆకులో పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి ఆ రోజు ఉపవాసం ఉన్నవారు ఆ పెరుగన్నాని మహా ప్రసాదంగా స్వీకరించి తిని ఉపవాస దీక్ష విరమించాలి.

ఈ విధంగా ఫాల్గుణ పౌర్ణమి వ్రతం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయనీ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.