మీ కోరికలు వెంటనే తీరాలంటే.. ఈ దేవాలయానికి ఒక్కసారి వెళ్లాల్సిందే..?
TeluguStop.com
మన భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.ఒక్కొ దేవాలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది.
వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.ఎంతో గొప్ప మహిమ కలిగిన పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటి వాటిలో తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది.
ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని( Anjaneya Temple) గర్భాలయానికి పైకప్పు లేదు.
అలాగే గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరుగాయి కానీ వేసిన కప్పు లు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు.
ఇక్కడ అనేక చరిత్రకా విశేషాలు కలవు.ఇది బెంగళూరుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మధురై జాతీయ రహదారిలో నామక్కల్ దేవాలయం కొలువై ఉంది. """/" /
ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామి( Lakshmi Narasimha Swamy )కి చేతులు జోడిస్తే దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు.
ఈ ఆంజనేయ స్వామి గర్భగుడి కి పైకప్పు లేదు.అందుకు ఆశ్చర్యమైన కారణాలు ఉన్నాయని దేవాలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.
మరి ఆ దేవాలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజు రోజుకు పెరుగుతూనే ఉందని పూజారులు చెబుతున్నారు.
అందువల్లే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ చరిత్ర చెబుతుంది. """/" /
నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
ఆయన కరుణ ఉంటే శత్రు శేషం, గ్రహదోషం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.
ఆయన చల్లని దీవెనలు మన పై పెడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు.
కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖ సంతోషాలను పర్యవేక్షిస్తున్నాడు.
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్.. వీడియో వైరల్ కావడంతో?