హెయిర్ డ్యామేజ్,పొడి జుట్టు, చుండ్రుకి చెక్ పెట్టాలంటే.... మెంతులతో ఇలా ట్రై చేయండి
TeluguStop.com
ఈ రోజుల్లో 40 సంవత్సరాలు వచ్చేయంటే బట్ట తల రావటం కామన్ అయ్యిపోయింది.
మారుతున్న కాలం, బిజీ జీవనశైలి,విపరీతమైన ఒత్తిడి వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మొదలు అవుతున్నాయి.
ఈ సమస్యలకు చెక్ పెట్టటానికి మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే మెంతులు సహాయపడతాయి.
అది ఎలాగో చూద్దాం.మెంతులలో నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది.
మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి.
ఈ విధంగా చేయటం వలన జుట్టుకు మెరుపు రావటమే కాకుండా జుట్టు చిట్లటం తగ్గుతుంది.
మెంతులను నీటిలో ఉడికించి ఆ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానము చేయాలి.
ఈ విధంగా చేయుట వలన జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు రాలటం తగ్గుతుంది.
మెంతులను మెత్తగా పొడి చేసి ఆ పొడిని కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టించి అరగంట తరవాత తలస్నానము చేస్తే తలలో దురద పొడిదనం తగ్గుతుంది.
మెంతి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.ఆకులను నీటిని వేరు చేసి ఆకులను మెత్తగా పేస్ట్ చేయాలి.
ఆ పేస్ట్ లో పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి.
మెంతి పొడిలో పెరుగు,నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
మెంతుల పొడిలో పాలు పోసి పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేస్తే జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
మెంతులు, ఉసిరి కలిపి పొడి చేసుకోవాలి.ఈ పొడిలో నిమ్మరసం,పెరుగు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?