సయ్యద్‌ సోహైల్‌ హీరోగా లక్కీ లక్ష్మణ్ మూవీ.. కథ తెలిస్తే షాక్?

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో కథ వేరుంటది అన్న డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు.

అయితే చాలామందికి సోహైల్ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇవ్వక ముందు వరకు ఎవరు అన్నది తెలియదు.

కానీ బిగ్ బాస్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తప్పకుండా సోహెల్ బిగ్ బాస్ టైటిల్ ని కొడతాడు అని అందరూ భావించినప్పటికీ ఊహించని విధంగా అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోహైల్ బాగానే అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సోహైల్ హీరోగా నటించిన తాజా చిత్రం లక్కీ లక్ష్మణ్.ఈ సినిమాకు ఏఆర్బి దర్శకుడుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

హరిత గోగినేని నిర్మాతగా వ్యవహరించారు.ఈనెల 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ. """/"/ డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నా ఒక కుర్రాడి కథ ఇది.

ఈజీగా కోటీశ్వరుడు అయిపోదామనుకునే ఆశతో ఒక డబ్బున్న అమ్మాయి వెంట పడతాడు.తర్వాత ఏమయ్యింది తెలియాలి అంటే లక్కీ లక్ష్మణ్ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది.ఇందులో సోహైల్ నటన ప్రధాన ఆకర్షగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు డైరెక్టర్.

అనంతరం నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.ప్రేమ కంటే విలువైనది గొప్పది ఈ సృష్టిలో ఏదీ లేదన్న అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)