రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
సాధారణంగా కొందరు చాలా చురుగ్గా ఉంటారు.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా( Energetic ) పని చేస్తుంటారు.
అలాంటి వారిని చూసినప్పుడు తాము కూడా డే మొత్తం ఎనర్జిటిక్ గా ఉండాలని కోరుకోవడం చాలా సహజం.
అయితే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలంటే మార్నింగ్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ పై( Breakfast ) ప్రత్యేక దృష్టి సారించాలి.
ఎందుకంటే, బ్రేక్ ఫాస్ట్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.రోజంతా చురుకైన మరియు ఆరోగ్యకరమైన స్థితిని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది.
అందుకే బ్రేక్ ఫాస్ట్ లో పొషకాహారం తీసుకోవాలి.అలాగే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను చేర్చుకుంటే శరీరానికి బోలెడంత శక్తి చేకూరుతుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం,( Badam ) ఒక కప్పు వాల్ నట్స్,( Walnuts ) ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు ఫూల్ మఖానా వేయించుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక గ్లాసు వేడి పాలు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్( Protein Powder ) మరియు వన్ టీ స్పూన్ బెల్లం పొడి కలుపుకుని తీసుకోవాలి.
"""/" /
ఈ డ్రింక్ మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి సహాయపడే శక్తిని మీ శరీరానికి చేకూరుస్తుంది.
అలాగే ఈ డ్రింక్ ఎముకలను బలోపేతం చేయడానికి కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ డ్రింక్ మెదడు పనితీరును పెంచుతుంది.
వయసు పైబడే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తుంది. """/" /
అంతేకాకుండా ఈ డ్రింక్ ను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.
శరీర బరువు అదుపులో ఉంటుంది.ఈ డ్రింక్ లోని మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మరియు ప్రోటీన్ వంటి పోషకాలు మీ గుండెకు మేలు చేస్తాయి.
కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలోనూ తోడ్పడతాయి.ఈ డ్రింక్ లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులు మరియు మంట నుండి రక్షించడంలో సహాయపడతాయి.
ఆ హీరో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన….ఇలా లీక్ చేసిందేంటి?