24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ రావాలి..: కేసీఆర్
TeluguStop.com
చొప్పదండిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఎన్నికలు వచ్చాయని ప్రజలు ఆగమాగం కావొద్దని చెప్పారు.అభ్యర్థితో పాటు పార్టీ గుణగణాలను చూసి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.
తెలంగాణలో గతంలో ఎలా ఉంది.బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉందో గమనించాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నో బాధలు పడ్డామని పేర్కొన్నారు.ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న కేసీఆర్ కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే వస్తుందన్న ఆయన రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు.