ఈ విధంగా వాకింగ్ చేస్తే.. ఎంత బరువు ఉన్నా కూడా వెంటనే తగ్గుతారు..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు ( Overweight )వలన ఇబ్బంది పడుతూ ఉంటారు.
దీనికోసం ఉదయాన్నే లేచి వాకింగ్( Walking ) కూడా వెళతారు.వారిలో కొందరు వేగంగా నడుస్తారు.
మరి కొందరేమో నెమ్మదిగా నడుస్తారు.అయితే వాకింగ్లో వేగంగా నడవడానికి బ్రిస్క్ వాక్ అని అంటారు.
ఒక అధ్యయనం ప్రకారం బ్రిస్క్ వాక్ చేసే వారిలో మిగతా వారి కంటే ఎక్కువ ఫలితాలు కనిపించాయి.
రోజులో గంట లేదా అరగంట పాటు చురుకైన నడక శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక రెగ్యులర్ వాకింగ్ చాలా ముఖ్యం.బ్రిస్క్ వాక్( Brisk Walk ) వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
అధిక రక్తపోటు( Blood Pressure ) లేదా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లయితే చురుకైన నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వాకింగ్ సమయంలో రక్తనాళాలు తెరవడం ప్రారంభిస్తాయి.దీంతోపాటు రక్తనాళాలలో పేర్కొన్న కొలెస్ట్రాల్ కణాలు కూడా కరిగిపోతాయి.
రక్తప్రసరణ సాధారణ అవుతుంది.దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాబట్టి ఉదయాన్నే 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం వలన బరువు తగ్గుతారు.
"""/" /
ఊపిరితిత్తుల సమస్యలు( Lung Problems ) ఉన్నవారికి కూడా బ్రిస్క్ వాకింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వేగంగా నడవడం వలన స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.దీంతో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
దీని వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.బ్రిస్క్ వాకింగ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు( Diabetics ) చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక నెల రోజులు తరచూ అరగంట పాటు వేగంగా నడవడం వలన ప్యాంక్రియాటిక్ పని తీరు మెరుగుపడుతుంది.
"""/" / అలాగే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.దీనివలన శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అరగంట పాటు క్రమం తప్పకుండా చురుకైన నడక నడవడం వలన కీళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
అలాగే రోజుకు పదివేల అడుగులు వేయడం వలన గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?