తిన్న వెంటనే నడిస్తే ఎసిడిటీ పెరుగుతుందా.. తగ్గుతుందా..?
TeluguStop.com

కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ పెరుగుతూ ఉంటుంది.ఈ ఆమ్లం కడుపులోని గ్రంథాల ద్వారా ఉత్పత్తి అవుతుంది.


ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సంకేతలు వస్తాయి.


ఎసిడిటీ చాలా సాధారణమైన సమస్య.ఎసిడిటీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.
అయితే ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత ఫుడ్ రియాక్టివిటీ, అజీర్ణం, మలబద్ధకం వీటన్నిటి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని వైద్యా నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాలలో వ్యాధుల కారణంగా కూడా కడుపులో మంట గా అనిపించవచ్చు.చాలాసార్లు ఏదైనా ఔషధం తీసుకోవడం సిరప్ తాగడం లేదా హోమ్ రెమెడీస్ ప్రయత్నిస్తారు.
అయితే ఇవేవీ అవసరం లేకుండా కూడా ఎసిడిటీ తగ్గించుకోవచ్చు.అందుకు ఒక సింపుల్ చిట్కా ఉంది.
అదేమిటి అంటే మీరు ఎసిడిటీ నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడి నుంచి లేచి కాసేపు నడిస్తే చాలని చెబుతున్నారు.
ఎందుకంటే నడకను కార్డియో వ్యాయామంగా పరిగణిస్తారు. """/" /
ఈ వ్యాయామం మీ హృదయ స్పందన( Heart ) రేటును పెంచుతుంది.
మీ కడుపు దానీ దిగువ బాగాలపై ఒత్తిడి తెస్తుంది.ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది.
దీని కారణంగా ఆహారం వేగంగా జీర్ణం కావడం మొదలవుతుంది.దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది.
ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య అనేది అసలు ఉండదు.<\నడకతో జీర్ణ వ్యవస్థ( Digestive System ) కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే అది ఎసిడిటీ సమస్య అని కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు.
"""/" /
ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు మీ జీవక్రియ రేటు( Metabolic Rate ) వేగం పెంచుకోవాలి.
అందుకు నడక మీకు ఎంతో బాగా సహాయపడుతుంది.అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు తినడం వల్ల మీ ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావం పడుతుంది.
కొవ్వులు అంత సులభంగా జీర్ణం కావు కాబట్టి మీరు మాంసం, కొవ్వు పదార్థాలు తిన్న తర్వాత కాసేపు నడవడం ఎంతో మంచిది.
చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద కిచెన్‌లోకి.. దోశ వేస్తూ నానా తంటాలు.. ఫన్నీ ఫొటో చూశారా?