ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!

పురుషులను ఎంతగానో కలవరపెట్టే కేశ సమస్యల్లో బట్టతల ముందు వరుసలో ఉంటుంది.జుట్టు కొంచెం అధికంగా రాలుతుంది అంటే మగవారిలో టెన్షన్ మొదలవుతుంది.

ఎక్కడ బట్టతల ( Bald )వస్తుందో అని తెగ భయపడిపోతూ ఉంటారు.అయితే ఇకపై నో వర్రీ.

ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే బట్టతల భయమే అక్కర్లేదు.

మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దాని ప్రయోజనాలు ఏంటి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాసు కొబ్బరి నూనె ( Coconut Oil )పోసుకోవాలి.

ఆ తర్వాత రెండు కప్పులు ఎండిన వేపాకు ( Dried Neem )వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము( Anise ) మరియు అంగుళం మెత్తగా దంచిన ఎండిన అల్లం వేసి దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి తల స్నానం చేయొచ్చు.

"""/" / వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే తలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

జుట్టు కుదుళ్ళు ( Hair Follicles )దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.పురుషుల్లో బట్టతల రిస్క్ ను తగ్గించడంలో ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా వేపాకు, అల్లం చుండ్రు చికిత్సలో తోడ్పడతాయి.స్కాల్ప్ ఆరోగ్యాన్ని పోషిస్తాయి.

కాబట్టి బట్ట తలకు దూరంగా ఉండాల‌ని భావించే పురుషులు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

ఛీ.. ఛీ.. రీల్స్ కోసం అన్న శవాన్ని వదలని చెల్లెలు!