మేకప్ అక్కర్లేదు.. ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!
TeluguStop.com
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని పడే ఆరాటం లో భాగంగా ఎక్కువ శాతం మంది మేకప్ తో( Makeup ) చర్మానికి మెరుగులు పెడుతూ ఉంటారు.
ముఖంలో ఉన్న లోపాలను దాచేస్తూ రకరకాల మేకప్ ఉత్పత్తులతో ఆర్టిఫిషియల్ అందాలను ప్రదర్శిస్తుంటారు.
కానీ నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు మనల్ని సహజంగానే అందంగా(
Natural Beauty ) చూపిస్తాయి.
మన చర్మ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక రెగ్యులర్ గా వాడితే మేకప్ అక్కర్లేదు.
సహజంగానే మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది.మరి ఇంతకీ ఆ క్రీమ్ ఏంటి.
? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్(లైకోరైస్ పౌడర్)( Licorice Powder ) ను వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనం వారం రోజుల పాటు వాడుకోవచ్చు.
"""/" /
ఈ క్రీమ్ ను ఉపయోగించే ముందు మేకప్ ఏమైనా ఉంటే తొలగించి శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
అనంతరం క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు క్రీమ్ ను అప్లై చేసుకొని ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ హోమ్ మేడ్ క్రీమ్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చర్మంపై ముదురు రంగు మచ్చలను మాయం చేస్తుంది.
మొటిమల సమస్యకు చెక్ పెడుతుంది.స్కిన్ టోన్ ను పెంచుతుంది.
చర్మం అద్దంలా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
డ్రై స్కిన్ సమస్య సైతం దూరం అవుతాయి.కాబట్టి సహజంగానే అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకునేవారు తప్పకుండా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.
చైతన్య శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ అయిందా.. అక్కడే పెళ్లి జరగబోతుందా?