అరవైలోనూ యంగ్‌గా కనిపించాలంటే.. మీరు దీన్ని ట్రై చేయాల్సిందే!
TeluguStop.com
అరవై ఏళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల పడుచు పిల్లలా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి.
దాదాపు అందరూ అదే కోరుకుంటారు.అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల అరవైలోనూ యంగ్‌గా కనిపించడం అసాధ్యమని భావిస్తుంటారు.
కానీ, సరైన పద్ధతులను పాటిస్తే.వయసు పెరిగిన యవ్వనంగా మెరిసిపోవచ్చు.
ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ గ్రైట్‌గా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటీ.
? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక క్యారెట్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండును తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్‌గా కట్ చేయాలి.
వీటితో పాటు అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అరటి పండు స్లైసెస్, అల్లం ముక్కలు, ఒక కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/"/
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.
చర్మం నిగారింపు, యవ్వనంగా మెరుస్తుంది.మరియు చర్మంపై ఏమైనా ముదురు రంగు మచ్చలు ఉన్నా.
క్రమంగా మాయం అవుతాయి.
నితిన్ తో లిప్ లాక్ కు నో చెప్పింది.. ఇప్పుడు గ్లామర్ షోకు సై.. కీర్తిలో మార్పు వెనుక కారణాలివేనా?