నీరసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో మనిషికి సంపాదనే ధ్యేయంగా మారింది.సంపాదనలో పడి ఏకకాలంలో మూడు నాలుగు పనులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మానసికంగా మ‌రియు శారీరకంగా అలసిపోతుంటారు.ఒక్కోసారి నీరసంగా మారిపోతుంటారు.

నీరసం( Adynamia ) కూడా ఒక జబ్బే.నీరసం నుంచి బయటపడందే మనిషి చురుగ్గా మారలేడు.

పైగా నీరసం వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.కనీసం నిలబడాలన్నా, నడవాలన్నా ఓపిక ఉండదు.

మీరు కూడా నీరసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే స్మూతీ మీ డైట్ లో కనుక ఉంటే వేగంగా మరియు సులభంగా నీరసాన్ని వదిలించుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled Oats ), ఐదు జీడిపప్పులు( Cashew Nuts ) మరియు నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకుని ఒక కప్పు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

"""/" / ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలు వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే అర కప్పు ఆపిల్ ముక్కలు, గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ( Amla ), వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax Seeds ), పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

తద్వారా మన స్మూతీ అనేది సిద్ధమవుతుంది. """/" / రోజు ఉదయం ఈ ఆపిల్ ఆమ్లా ఓట్స్ స్మూతీని తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా ఈ స్మూతీ ఎలాంటి నీరసాన్ని అయినా వదిలిస్తుంది.శరీరానికి అవసరమయ్యే శక్తిని చేకూరుస్తుంది.

మిమ్మల్ని ఉత్సాహంగా మారుస్తుంది.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.

అతి ఆకలి దూరం అవుతుంది.అధిక బరువు స‌మ‌స్య నుంచి బ‌ట‌య‌ప‌డ‌తారు.

మరియు గుండె ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

ఆరోగ్యానికి ప‌సుపు మంచిదే.. కానీ వారు మాత్రం తిన‌కూడ‌దు..!