నిత్యం ఈ పొడిని తీసుకుంటే హెయిర్ ఫాల్‌కు గుడ్ బై చెప్పొచ్చు!

హెయిర్ ఫాల్ తో ( Hair Fall )బాగా ఇబ్బంది పడుతున్నారా.? జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా.

? ఖరీదైన హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ వాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందా.

? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి పోషకాల కొరత కారణంగా కూడా జుట్టు అధికంగా రాలిపోతూ ఉంటుంది.

కాబట్టి పైపై పూతలే కాకుండా మంచి డైట్ ను కూడా మెయింటైన్ చేయాలి.

అప్పుడే జుట్టు రాలడం సమస్య తగ్గు ముఖం పడుతుంది. """/" / ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని నిత్యం కనుక తీసుకున్నారంటే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పొచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఎండిన కరివేపాకు( Curry Leaves ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు సన్ ఫ్లవర్ సీడ్స్, పది నుంచి ప‌దిహేను బాదం గింజలు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

"""/" / ప్రతిరోజు ఈ పొడిని ఒక స్పూన్ చొప్పున నేరుగా లేదా ఒక గ్లాస్ వాటర్ లో కలిపి తీసుకోవాలి.

మెంతులు, అవిసె గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్( Fenugreek, Flax Seeds, Sunflower Seeds ), కరివేపాకు, బాదంలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.

జుట్టు రాలే సమస్యను అడ్డుకుంటాయి.అలాగే నిత్యం ఈ పొడిని తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

కురులు దట్టంగా పెరగడం ప్రారంభం అవుతాయి.ఆరోగ్యమైన దట్టమైన కురులను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న పొడిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!