ఈ పొడిని రోజుకో స్పూన్ చొప్పున తీసుకుంటే మీ బోన్స్ అవుతాయి సూపర్ స్ట్రాంగ్..!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో చాలామంది చిన్నవయసులోనే జాయింట్ పెయిన్స్ అంటూ బాధపడుతున్నారు.ఇందుకు కారణం ఎముకల బలహీనత( Weakness Of Bones ).
వయసు పెరిగే కొద్దీ, ఎముకలు బలహీనంగా మరియు తక్కువ సాంద్రతతో మారడం అనేది చాలా సహజం.
కానీ వయసులో ఉండగానే ఎముకలు బలహీనపడితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చే ఓ సూపర్ పొడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా 150 గ్రాములు బాదం గింజలను( Almonds ) హాట్ వాటర్ లో పోసి తొక్క తొలగించి ఒక క్లాత్ పై తడి పడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టుకుని అందులో తొక్క తొలగించిన బాదం గింజలు వేసుకోవాలి.
అలాగే గుప్పెడు పిస్తా పప్పు( Pistachio Nut ), గుప్పెడు జీడిపప్పు( Cashew Nut ) వేసుకుని చిన్న మంటపై గరిటె తో తిప్పుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి.
చివరిలో గుప్పెడు వాల్ నట్స్ కూడా వేసి వేయించుకోవాలి. """/" /
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వేసుకోవాలి.
వీటితో పాటు వన్ టీ స్పూన్ పసుపు( Turmaric ), మూడు టేబుల్ స్పూన్లు పట్టిక బెల్లం పొడి, అర గ్రాము కుంకుమపువ్వు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ పొడిని ఒక గ్లాసు వేడి పాలల్లో ఒక స్పూన్ చొప్పున మిక్స్ చేసి తాగేయడమే.
రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా నైట్ నిద్రించేముందు ఈ నట్స్ పొడిని పాలతో కలిపి తీసుకున్నారంటే బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఎముకలు బలంగా దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
"""/" /
అంతేకాకుండా పైన చెప్పుకున్న నట్స్ పౌడర్ ను నిత్యం పాలతో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా శరీరానికి అవసరమయ్యే శక్తి చేకూరుతుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెదడు చురుగ్గా మారుతుంది.ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతాయి.
మరియు కంటి చూపు సైతం పదునుగా మారుతుంది.
Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown