బీట్ రూట్ జ్యూస్ లో ఇవి రెండు కలిపి తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం!

మ‌న ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే దుంప‌ల్లో బీట్ రూట్ ఒక‌టి.బీట్ రూట్( Beetrroot ) లో ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.

అందువ‌ల్ల చాలా మంది రోజూ ఉద‌యం ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటారు.

అయితే బీట్ రూట్ జ్యూస్ ను నేరుగా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే రెండు ప‌దార్థాల‌ను జోడించి తీసుకుంటే మీరు ఆశ్చ‌ర్య‌పోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

ఇంత‌కీ ఆ రెండు ప‌దార్థాలు మ‌రేంటో కాదు నిమ్మ‌ర‌సం మ‌రియు ప‌సుపు.బీట్ రూట్ జ్యూస్‌లో నిమ్మరసం, పసుపు( Lemon Juice, Turmeric ) క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ లాభాలు పొందుతార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నిమ్మర‌సం, ప‌సుపులో ఉండే కర్కుమిన్ మరియు విటమిన్ సి బీట్ రూట్ తో జత చేసినప్పుడు.

అందులోని ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు బాగా పని చేస్తాయి.అలాగే ఈ క‌ల‌యిక అనేక రకాల బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

"""/" / బీట్ రూట్ జ్యూస్ లో నిమ్మ‌ర‌సం, ప‌సుపు క‌లిపి తాగ‌డం వ‌ల్ల పోషకాల శోషణ పెరుగుతుంది.

నిమ్మరసం బీట్‌రూట్ నుండి ఇనుము శోషణను పెంచుతుంది, రక్తహీనత( Anemia ) బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

బీట్ రూట్ జ్యూస్‌లో నిమ్మరసం మరియు పసుపు జోడించడం వ‌ల్ల‌ యాంటీ ఆక్సిడెంట్‌ స్థాయిలు పెరుగుతాయి మరియు ఆక్సీకరణ ఒత్తిడి త‌గ్గుతుంది.

మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. """/" / ప‌సుపు, నిమ్మ‌ర‌సం క‌లిపిన బీట్ రూట్ జ్యూస్ కాలేయ నిర్విషీకరణలో సహాయపడుతుంది మరియు కాలేయ పనితీరును పెంచుతుంది.

జీర్ణ‌క్రియ ఆరోగ్యానికి కూడా ఈ క‌ల‌యిక చాలా మేలు చేస్తుంది.నిమ్మరసం యొక్క ఆమ్లత్వం జీర్ణక్రియకు మ‌ద్ద‌తు ఇస్తుంది, పసుపు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అంతేకాదు, బీట్ రూట్ జ్యూస్ లో ప‌సుపు మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

బాడీ డీటాక్స్ అవుతుంది.జీవ‌క్రియ రేటు కూడా పెరుగుతుంది.

రిమోట్ బాగుచేసినట్టే చెవుడు నయం చేస్తున్నాడు.. ఈ డాక్టర్ ట్రీట్మెంట్ వైరల్!