కాఫీలో వీటిని కలిపి తీసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!

కాఫీ.( Coffee ) ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో ఒకటి.

కాఫీ అలవాటైందంటే దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు.కాఫీకి లక్షల్లో లవర్స్ ఉంటే కోట్లలో బానిసలు ఉంటారు.

ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ ఒంట్లో పడిందంటే చాలు ఎక్కడా లేని ఎనర్జీ మనకే వస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది.

పరిమితంగా తీసుకుంటే కాఫీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.

అయితే కాఫీని నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి తీసుకుంటే మీరు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.మరి లేటెందుకు కాఫీలో ఏయే పదార్థాలు కలిపి తీసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

లవంగాలు.( Cloves ) కాఫీకి చక్కటి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు.

రోజు ఉదయం తాగే కప్పు కాఫీలో పావు టీ స్పూన్ లవంగాల పొడి కలుపుకుని తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.క్యాన్సర్( Cancer ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.

స్టమక్ అల్సర్ సమస్య ఉంటే దూరం అవుతుంది. """/" / అలాగే కాఫీలో యాలకులు( Cardamom ) కలిపి తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి.

తలనొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కాఫీలో యాలకులు పొడి కలిపి తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.

ఒత్తిడి దూరం అవుతుంది.పైగా కాఫీలో యాలకుల పొడి కలిపి తీసుకుంటే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు. """/" / కాఫీకి మీరు జాజికాయ పొడిని కూడా జోడించవచ్చు.

జాజికాయలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల జాజికాయ పొడిని కాఫీలో కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

నిద్రలేమి దూరమవుతుంది.నిద్ర నాణ్యత పెరుగుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు సైతం తలెత్తకుండా ఉంటాయి.

జగన్ మద్దతు ఇవ్వకపోతే… బీజేపీ టార్గెట్ వారే ?