ఈ జాగ్రత్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే!

ఈ జాగ్రత్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రు త‌ర‌చూ అల‌స‌ట‌కు( Tired ) గుర‌వుతుంటారు.శారీరకంగా లేదా మానసికంగా ఎక్కువ పని చేయడం, శ‌రీరానికి స‌రిప‌డా విరామం ఇవ్వ‌క‌పోవ‌డం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, అధికంగా వ్యాయామం చేయండి, పోషకాహార లోపం, ర‌క్త‌హీన‌త‌, థైరాయిడ్, మధుమేహం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, ఆందోళ‌న త‌దిత‌ర అంశాలు అల‌స‌ట‌కు కార‌ణం అవుతాయి.

ఈ జాగ్రత్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే!

దాంతో చాలా వీక్ అయిపోతూ ఉంటారు.ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.

ఈ జాగ్రత్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే!

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే.అల‌స‌ట‌కు దూరంగా ఉండాల‌నుకునేవారు లేదా అల‌స‌ట నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌నుకునేవారు మొద‌ట శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వండి.

రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్ర ఉండేలా చూసుకోండి.ఎక్కువ గంటల పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ( Computer, Laptop )ముందు కూర్చొని పని చేసేవారు ఒక్కో గంటకు క‌చ్చితంగా ఐదు నిమిషాల బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వండి.

"""/" / ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి12 ( Proteins, Iron, Magnesium, Vitamin B12 )కలిగిన ఆహారం తీసుకోండి.

తాజా పండ్లు, కూరగాయలు, న‌ట్స్‌, సీడ్స్‌ తీసుకోవడం అలవాటు చేసుకోండి.నీరు ఎక్కువగా తాగండి.

ఒత్తిడికి వీల‌నైంత వ‌ర‌కు దూరంగా ఉండండి.అందుకోసం ధ్యానం, ప్రాణాయామం చేయండి.

మ్యూజిక్ విన‌డం, డాన్స్ చేయ‌డం, బుక్స్ చ‌ద‌వ‌డం వంటి అల‌వాట్లు కూడా ఒత్తిడి నుంచి మిమ్మ‌ల్ని దూరంగా ఉంచుతాయి.

"""/" / రక్తహీనత ఉన్నా త‌ర‌చూ అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.కాబ‌ట్టి ర‌క్త‌ప‌రీక్ష చేయించుకుని వైద్యులు సూచించిన మందులు వాడండి.

బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి స‌మ‌స్య‌ల‌ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నించండి.అధికంగా కాకుండా మితంగా వ్యాయామం చేయండి.

ఇక‌పోతే అల‌స‌ట‌కు గురైన‌ప్పుడు కొబ్బరి నీరు, గ్రీన్ టీ, నిమ్మ నీరు, బాదం పాలు, హెల్తీ మిల్క్ షేక్స్‌, ఫ్రూట్ స్మూతీలు, బీట్‌రూట్ జ్యూస్ వంటివి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

ఇటువంటి పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి.ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.

అల‌స‌ట నుంచి వేగంగా బ‌య‌ట‌ప‌డ‌టానికి ఉత్త‌మంగా తోడ్ప‌డ‌తాయి.

విశ్వక్ సేన్ తో గొడవపై స్పందించిన నాని…. అసలు జరిగింది ఇదేనంటూ!

విశ్వక్ సేన్ తో గొడవపై స్పందించిన నాని…. అసలు జరిగింది ఇదేనంటూ!