అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా పాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.అందుకే వైద్య నిపుణులు అందరినీ రోజుకొక గ్లాస్ పాలు తాగాలని సూచిస్తుంటారు.
అయితే పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు.అందుకే పాలను ఎవైడ్ చేస్తుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే విధంగా పాలను తీసుకుంటే బరువు పెరగడం కాదు క్రమంగా తగ్గుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గడానికి పాలను ఎలా తీసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ పోయాలి.
పాలు కాస్త హీట్ అయ్యాక.అందులో అర స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి.
చివరిగా ఒక స్పూన్ బెల్లం వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు పాలను వడ గట్టుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి. """/" /
ఇలా రెండు రోజులకు ఒక సారి ఉదయం పూట తీసుకుంటే గనుక శరీరంలో పేరుకు పోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.
అదే సమయంలో అతి ఆకలి తగ్గు ముఖం పట్టి తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.
అలాగే పైన చెప్పిన విధంగా పాలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఆస్తమా లక్షణాలు అదుపులోకి వస్తాయి.అంతే కాదు ఇప్పుడు చెప్పుకున్న విధంగా పాలను తీసుకుంటే రాత్రుళ్లు నిద్ర బాగా పడుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, తల నొప్పి వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.
మరియు మెదడు చురుకు దనం కూడా పెరుగుతుంది.కాబట్టి, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు మాత్రమే కాదు.
ఎవ్వరైనా పాలను ఇలా తీసుకోవచ్చు.
కజకిస్థాన్‌లో విషాదం.. భారత వైద్య విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం!