వేస‌విలో ఖ‌ర్జూరాల‌ను ఇలా తీసుకుంటే బాడీ కూల్‌గా మార‌డం ఖాయం!

వేస‌వి ఎండ‌లు మొద‌ల‌య్యాయి.ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచే భానుడు భ‌గ‌భ‌గ‌మంటూ ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాడు.

ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాల‌ను తీసుకోవాలి.అటువంటి వాటిలో ఖ‌ర్జూరాలు ఒక‌టి.

మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండే ఖ‌ర్జూరాల్లో బోలెడ‌న్ని పోష‌కాలూ మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇవి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఖ‌ర్జూరాల‌ను వేస‌విలో తీసుకుంటే మీ బాడీ కూల్‌గా మార‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గింజ తొల‌గించిన ఎనిమిది ఖ‌ర్జూరాలు, రెండు అంజీర్, నాలుగు కిస్‌మిస్‌లు, నాలుగు జీడిప‌ప్పులు, ఒక క‌ప్పు పాలు వేసుకుని రెండు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల పాలు పోయాలి.

పాలు కాస్త మరిగిన వెంట‌నే అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని వేసి మూడు నిమిషాల పాటు మ‌రిగించాలి.

చివ‌రిగా నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ డ్రింక్‌ను గ్లాస్‌లోకి స‌ర్క్ చేసి ఫ్రిడ్జ్‌లో అర‌గంట పాటు పెట్టుకోవాలి.అనంత‌రం బ‌య‌ట‌కు తీసి సేవించాలి.

ఈ విధంగా రోజూ చేస్తే అధిక వేడి క్ర‌మంగా త‌గ్గి శ‌రీరం కూల్‌గా మారుతుంది.

"""/"/ అంతేకాదు, పైన చెప్పిన విధంగా ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ఆక‌లి త‌గ్గుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.రోజంతా శ‌రీరం యాక్టివ్‌గా ఉండేందుకు కావాల్సినంత ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

మెద‌డు మునుప‌టి కంటే చురుగ్గా మారుతుంది.మ‌రియు వేస‌వి ఎండ‌ల వ‌ల్ల ఎదుర‌య్యే త‌ల‌నొప్పి, అధిక దాహం, వ‌డ‌దెబ్బ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.