కీరాను ఇలా తీసుకుంటే బాడీ డీటాక్స్ అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు!
TeluguStop.com
కీర దోసకాయ.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఇది ఒకటి.
కీర దోసకాయ లో నీటి శాతం అధికంగా ఉంటుంది.అలాగే ఎన్నో పోషకాలు సైతం నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా కీర ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా కీరాను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే బాడీ డీటాక్స్ అవ్వడమే కాదు వేగంగా వెయిట్ లాస్ కూడా అవుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం కీర దోసకాయను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక కప్పు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక మీడియం సైజు కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర స్లైసెస్, అల్లం ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసి సేవించాలి.
"""/"/
ఈ విధంగా కీరా జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలు తొలగిపోతాయి.